హోటళ్లలో శుభ్రత పాటించకపోతే చర్యలు
ABN , First Publish Date - 2021-11-22T04:43:10+05:30 IST
నర్సాపూర్‌లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి
నర్సాపూర్, నవంబరు 21: నర్సాపూర్‌లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి హోటళ్లలో పరిశుభ్రత పాటిస్తున్నారా?, నాణ్యత పాటిస్తున్నారా? లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని నిర్వాహకులకు సూచించారు.