ఎన్హెచ్ఏఐ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-07T04:57:58+05:30 IST
ఆందోలు మండలంలో జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని కాంగ్రె్‌సకు చెందిన మాజీ సర్పంచ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు ఆర్డీవో విక్టర్‌కు, తహసీల్దార్ అశోక్‌కు శనివారం వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
జోగిపేట, మార్చి 6 : ఆందోలు మండలంలో జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని కాంగ్రె్‌సకు చెందిన మాజీ సర్పంచ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు ఆర్డీవో విక్టర్‌కు, తహసీల్దార్ అశోక్‌కు శనివారం వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం 25 ఎకరాల్లోనే మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు పొందిన కాంట్రాక్టర్.. నిబంధనలు అతిక్రమించి ఇతర ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో మట్టిని తవ్వుకుంటున్నాడని ఆరోపించారు. అందోలు మాజీ సర్పంచ్ ఆర్.ప్రదీ్‌పగౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, మాజీ కౌన్సిలర్ శరత్‌బాబు పాల్గొన్నారు.