ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-20T07:11:08+05:30 IST

సిర్గాపూర్‌ ఎంపీడీవో సుజాత తమను 2 గంటల పాటు కార్యాలయం ఎదుట నిలబెట్టడమే కాకుండా వివక్ష చూపారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్మికులు మంగళవారం సిర్గాపూర్‌ ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలి
సిర్గాపూర్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పంచాయతీ కార్మికులు

 కల్హేర్‌, జనవరి 19: సిర్గాపూర్‌ ఎంపీడీవో సుజాత తమను 2 గంటల పాటు కార్యాలయం ఎదుట నిలబెట్టడమే కాకుండా వివక్ష  చూపారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్మికులు మంగళవారం సిర్గాపూర్‌ ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమకు మూణ్ణాలుగు వేలు మాత్రమే వేతనంగా ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీడీవో సుజాతకు వినతిపత్రాన్ని ఇవ్వబోతే నిర్లక్ష్యంగా వ్యవహరించి అవమానపరిచారని వాపోయారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు చిరంజీవి, గ్రామ పంచాయతీ సంఘం నాయకులు లక్ష్మయ్య, సాయిలు, అశోక్‌, భూమన్న, శంకర్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-20T07:11:08+05:30 IST