‘రియల్’ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-30T19:57:52+05:30 IST
కొమురవెల్లి మండలం అయినాపూర్, రసూలాబాద్ గ్రామశివారులోని గౌడకులస్తుల భూమిలో అక్రమంగా ప్లాటింగ్ చేసిన రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మోకుదెబ్బ..

చేర్యాల, డిసెంబరు 29: కొమురవెల్లి మండలం అయినాపూర్, రసూలాబాద్ గ్రామశివారులోని గౌడకులస్తుల భూమిలో అక్రమంగా ప్లాటింగ్ చేసిన రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు అమరవేని నర్సాగౌడ్, కార్యదర్శి రావుల సిద్ధిరాములు మాట్లాడారు. జీవో నెం.560ప్రకారం 20ఏళ్ల క్రితం ప్రభుత ్వం అయినాపూర్ గ్రామశివారులో ఐదెకరాలభూమిని గీతకార్మిక సొసైటీకి అప్పగించడంతో ఈత చెట్లు నాటినట్లు చెప్పారు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గౌడకులస్తులను మభ్యపెట్టి భూమిని లాక్కోవడం తగదని హితవు చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి గౌడసొసైటీ భూమిని తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మోకుదెబ్బ సంఘం నాయకులు కిరణ్‌కుమార్, బాలాజీ, సురేశ్, పచ్చిమడ్ల స్వామి, కనకయ్య, ఎల్లయ్య, అనిల్, శివ, బాబు, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.