ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో మంటలు

ABN , First Publish Date - 2021-12-09T04:39:05+05:30 IST

ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో మంటలు చేలరేగిన సంఘటన బుధవారం మిరుదొడ్డిలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో మంటలు

 మిరుదొడ్డి, డిసెంబరు 8: ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో మంటలు చేలరేగిన సంఘటన బుధవారం మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. బాధితుడు భగవాన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన ఓ రైతు పొలంలో వరిని కోస్తుండగా.. హార్వెస్టర్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి మంటలు చేలరేగాయి. రైతులు గమనించి డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే వాహనాన్ని ఆపి కిందకు దిగాడు. రైతులు బోరుమోటార్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు రూ.మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హార్వెస్టర్‌ యాజమని తెలిపాడు. 


Updated Date - 2021-12-09T04:39:05+05:30 IST