కుట్రతోనే దళితబంఽధు నిలిపివేత

ABN , First Publish Date - 2021-10-20T04:33:57+05:30 IST

దళితులపై బీజేపీ ప్రభుత్వం కుట్రపన్ని, వారిని మోసం చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు.

కుట్రతోనే దళితబంఽధు నిలిపివేత
బెజ్జంకిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

  కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ఫైర్‌

 బెజ్జంకిలో దిష్టిబొమ్మ దహనం


బెజ్జంకి, అక్టోబరు 19: దళితులపై బీజేపీ ప్రభుత్వం కుట్రపన్ని, వారిని మోసం చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్‌ కమిషన్‌తో కుట్రపన్ని హుజురాబాద్‌లో నిలిపివేయించిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆదేశానుసారం బెజ్జంకిలో మంగళవారం టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైలెట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే.. కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌ మంజుల, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఆలయ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌, సర్పంచులు మొండయ్య, లింగారెడ్డి, ఎంపీటీసీ శారద, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ గుప్తా, నరేష్‌, ప్రభాకర్‌, రాజయ్య, దేవయ్య,మోహన్‌, ఆయా గ్రామాల్లోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-20T04:33:57+05:30 IST