బైక్‌తో కల్వర్టును ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-09-02T05:30:00+05:30 IST

దుబ్బాక రామసముద్రం చెరువు కల్వర్టును బైక్‌తో ఢీకొన్న ఘటనలో గురువారం రాత్రి ఓ యువకుడు మృతి చెందాడు.

బైక్‌తో కల్వర్టును ఢీకొని యువకుడి మృతి

దుబ్బాక, సెప్టెంబరు 2: దుబ్బాక రామసముద్రం చెరువు కల్వర్టును బైక్‌తో ఢీకొన్న ఘటనలో గురువారం రాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన పల్లెపు రాజయ్య కుమారుడు నవీన్‌(22) దుబ్బాక నుంచి హబ్షీపూర్‌ వైపు సాయంత్రం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. స్థానిక రామసముద్రం చెరువు కట్ట వద్దకు చేరుకోగానే కల్వర్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన నవీన్‌ను సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.   

Updated Date - 2021-09-02T05:30:00+05:30 IST