కవి, తెలంగాణ పోరాటయోధుడు మఖ్దూం మొహియొద్దీన్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-10-12T05:02:44+05:30 IST

ప్రముఖ ఉర్దూ కవి, తెలంగాణ సాయుఽధ పోరాట కాలంలో నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన తెలంగాణ పోరాట యోధుడు మఖ్దూం మొహియొద్దీన్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించనున్నది.

కవి, తెలంగాణ పోరాటయోధుడు  మఖ్దూం మొహియొద్దీన్‌కు అరుదైన గౌరవం

13న ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ విడుదల 

జోగిపేట, అక్టోబరు 11: ప్రముఖ ఉర్దూ కవి, తెలంగాణ సాయుఽధ పోరాట కాలంలో నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన తెలంగాణ పోరాట యోధుడు మఖ్దూం మొహియొద్దీన్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించనున్నది. ఆయన స్మారకార్థం భారత పోస్టల్‌శాఖ (ఇండియా పోస్ట్‌) ఒక ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేయనున్నట్టు సంగారెడ్డి జిల్లా పోస్టల్‌ అధికారులు తెలిపారు. 1908లో సంగారెడ్డి జిల్లా అందోలు గ్రామంలో జన్మించిన మఖ్దూం మొహియొద్దీన్‌ హైదరాబాద్‌లో 1946-50 మధ్య కాలంలో నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. విలేకరిగా నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ఆయన, కవిగా నిజాం నిరంకుశ విధానాలను ఎండగడుతూ పలు కవితలను కూడా రాసి, ప్రజల్లో నిజాంపై వ్యతిరేకతను పెంపొందించారు. ‘ఏ జంగ్‌ హై.. జంగ్‌ హీ ఆజాదీ’ అనే కవిత ద్వారా దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. మఖ్దూం మొహియొద్దీన్‌ విగ్రహాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయించారు. ఇంతటి ఖ్యాతి కలిగిన మఖ్దూం స్మారకార్థం ఈ నెల 13న ఆయన జన్మస్థలం అందోలులో అధికారులు ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేయనున్నారు. 

Updated Date - 2021-10-12T05:02:44+05:30 IST