భూ తగాదాలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2021-08-11T05:11:46+05:30 IST

మండలంలోని పెద్దారెడ్డిపేటలో సోమవారం జరిగిన భూసరిహద్దు ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మహమ్మద్‌ మహబూబ్‌ (65)ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే.

భూ తగాదాలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

పుల్‌కల్‌, ఆగస్టు 10: మండలంలోని పెద్దారెడ్డిపేటలో సోమవారం జరిగిన భూసరిహద్దు ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మహమ్మద్‌ మహబూబ్‌ (65)ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. కాగా చికిత్స పొందుతున్న మహబూబ్‌ మంగళవారం మృతి చెందారు. ఈ ఘటనలో నిందితుడైన కొత్తపేట చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మృతుడి కుమారుడు ఖదీర్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బండారు నాగలక్ష్మి తెలిపారు. కాగా బుధవారం రిమాండ్‌కు తరలించనున్నట్టు సమాచారం. మహబూబ్‌ హత్యకు గురవడంతో పెద్దారెడ్డిపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.  

Updated Date - 2021-08-11T05:11:46+05:30 IST