ఉమ్మడి జిల్లాలో 540 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-05-21T04:45:29+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో గురువారం 540 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో ఆయా ఆస్పత్రుల్లో 1,796 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా.. 295 మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయ్యింది. సిద్దిపేట జిల్లా పరిధిలో వైద్యాధికారులు అధికారికంగా కరోనా సంబంధిత సమాచారం వెల్లడించడం లేదు.

సిద్దిపేట జిల్లాలో 295 కేసులు నమోదు
సిద్దిపేట, మెదక్ అర్బన్, సంగారెడ్డి టౌన్, మే 20: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో గురువారం 540 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో ఆయా ఆస్పత్రుల్లో 1,796 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా.. 295 మంది కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయ్యింది. సిద్దిపేట జిల్లా పరిధిలో వైద్యాధికారులు అధికారికంగా కరోనా సంబంధిత సమాచారం వెల్లడించడం లేదు. అలాగే, మెదక్ జిల్లాలో 141 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గురువారం ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 681 మందికి నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా మెదక్‌లో 31, రామాయంపేటలో 18 కరోనా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో గురువారం 104 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,674 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి నుంచి 110 మంది, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 125 శాంపిళ్లను గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 9 మంది మృతి
సిద్దిపేట, మే 20: సిద్దిపేట జిల్లాలో గురువారం కరోనా బారినపడి తొమ్మిదిమంది మృతిచెందినట్టు సమాచారం. సిద్దిపేట జీజీహెచ్‌లో ఆరుగురు, రైతు బజార్ సమీపంలో నివసించే డాక్యుమెంట్ రైటర్, భారత్‌నగర్‌లో ఒకరు, గజ్వేల్‌లో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శంకరయ్య మృతి చెందారు.
చిల్‌పచెడ్: మెదక్ జిల్లా చిల్‌పచెడ్ మండల పరిధిలోని జగ్గంపేటలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు (70) గురువారం మృతి చెందారు.