షార్ట్‌ఫిల్మ్‌లో జాతీయ స్థాయిలో జిల్లాకు 2వ బహుమతి

ABN , First Publish Date - 2021-11-10T05:13:33+05:30 IST

షార్ట్‌ఫిల్మ్‌లో జాతీయస్థాయిలో జిల్లాకు 2వ బహుమతి వచ్చిందని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు.

షార్ట్‌ఫిల్మ్‌లో జాతీయ స్థాయిలో జిల్లాకు 2వ బహుమతి

సంగారెడ్డి అర్బన్‌: షార్ట్‌ఫిల్మ్‌లో జాతీయస్థాయిలో జిల్లాకు 2వ బహుమతి వచ్చిందని కలెక్టర్‌ హన్మంతరావు తెలిపారు. స్వచ్ఛత ఫిల్మొంకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా స్వచ్చభారత్‌ మిషన్‌ గ్రామీణ ఓడీఎఫ్‌ ప్లస్‌లో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్‌ ఫిలింపోటీలు నిర్వహించగా, జిల్లా నుంచి 72 షార్ట్‌ ఫిలింలను అప్‌లోడ్‌ చేశారు. అందులో తడి, పొడి చెత్త నిర్వహణలో కంగ్టి మండలం ఎంకె మూర్తి, గ్రామ పంచాయతీ సెక్రటరీ అభిలాష్‌ రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ జాతీయస్థాయిలో 2వ బహుమతికి ఎంపికైందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ నెల 19న ఉపరాష్ట్రపతి ద్వారా ఢిల్లీలో అవార్డును అందుకుంటారు.  

Updated Date - 2021-11-10T05:13:33+05:30 IST