డ్రంకెన్ డ్రైవ్‌లో 21 మందికి జరిమానా
ABN , First Publish Date - 2021-02-07T05:29:20+05:30 IST
మద్యం సేవించి వాహనాలు నడిపిన 21 మందికి ఖేడ్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంత రూ.38 వేల జరిమానా విధించినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

నారాయణఖేడ్, ఫిబ్రవరి 6 : మద్యం సేవించి వాహనాలు నడిపిన 21 మందికి ఖేడ్ జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంత రూ.38 వేల జరిమానా విధించినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పట్టణ సరిహద్దుల్లో పదిరోజులుగా తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 21 మందిని పట్టుకుని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా జరిమానా విధించారని చెప్పారు.