దుబ్బాక ఆసుపత్రికి కోటి 16లక్షలు

ABN , First Publish Date - 2021-12-20T05:29:17+05:30 IST

దుబ్బాకలోని వంద పడకల ఆసుపత్రికి ప్రభుత్వం రూ.కోటి 16 లక్షలను మంజూరు చేసిందని టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

దుబ్బాక ఆసుపత్రికి కోటి 16లక్షలు


 ఎంపీ ప్రభాకర్‌రెడ్డి చొరవతోనే: టీఆర్‌ఎస్‌


దుబ్బాక, డిసెంబరు 19: దుబ్బాకలోని వంద పడకల ఆసుపత్రికి ప్రభుత్వం రూ.కోటి 16 లక్షలను మంజూరు చేసిందని టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవతో మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో నిధులు మంజూరయ్యాయని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఆర్‌.రాజమౌళి, ఎల్లారెడ్డి, కొత్త కిషన్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఆస యాదగిరి, దుబ్బాక బాలకృష్ణ, గన్నె భూమిరెడ్డి, బండిరాజు, బట్టు ఎల్లం, దేవుని చంద్రయ్య, ఆకుల దేవేందర్‌ తెలిపారు. ఆసుపత్రి ప్రహరీ నిర్మాణం కోసం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్‌టీ19 ప్రకారం తెలంగాణ రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ నిధుల నుంచి మంజూరు చేసినట్టు తెలిపారు. దుబ్బాక ఆసుపత్రికి మరిన్ని నిధులను అందించేందుకు మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ సుమారు రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు వివరించారు. 


 

Updated Date - 2021-12-20T05:29:17+05:30 IST