ప్రహసనంగా జడ్పీ సమావేశాలు

ABN , First Publish Date - 2021-11-23T05:39:04+05:30 IST

జిల్లా పరిషత్‌ సమావేశాలు ప్రహస నంగా మారుతున్నాయి.

ప్రహసనంగా జడ్పీ సమావేశాలు
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి

- సమయపాలన లేకుండా అడ్డగోలు వ్యవహారం

-  రెండున్నర గంటలు ఆలస్యంగా సమావేశం ఆరంభం

- గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకపోవడం పై టీఆర్‌ఎస్‌ సభ్యుల నుంచే నిరసన


నాగర్‌కర్నూల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ సమావేశాలు ప్రహస నంగా మారుతున్నాయి. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ప్రభావం చూపలేక పోతుండడంతో ఇష్టారాజ్యంగా మారుతున్నది. ఇందుకు ప్రతి మూడు నెలలకు ఒక సారి జరిగే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికగా మారుతున్నది. సోమవారం కూడా తిర్మల ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఇదే దృశ్యం ఆవిష్కృ తమైంది. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఉదయం 10గంటలకు ప్రారంభం అ వుతుందని ఎజెండాలో పొందుపరచగా 12గంటల వరకు పూర్తి స్థాయిలో ప్రజా ప్రతి నిధులు హాజరు కాలేదు. 12న్నరకు సమావేశం ప్రారంభం కాగానే ఆదరా బాదరగా ముగించే ప్రయత్నం చేయడం తప్ప కీలకమైన ప్రజా అంశాలు చర్చకు రాలేదు. టీ ఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సభ్యులే గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లా అసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అధికార, విపక్ష సభ్యులు అనే తేడా లేకుండా విమర్శలు గుప్పించారు. కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జోక్యం చేసుకొని మళ్లీ వచ్చే సమావేశం నాటికి పరిస్థితులు చక్కదిద్దుతామని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-11-23T05:39:04+05:30 IST