జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-07-13T05:08:28+05:30 IST

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అధికారులకు సూచించారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత 

గద్వాల రూరల్‌, జూలై 12 : జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు.  ముం దుగా పల్లె ప్రగతి కార్యక్రమాలపై అధికారులు నివేదికను చదివి వినిపించారు. గ్రామాల అభివృ ద్ధిపై అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని చైర్మన్‌ సూచించారు. వైద్యశాఖపై నిర్వహించిన సమావేశంలో ఆమె అధికారులను అభినందించారు. కరోన సమయంలో అందరికీ మెరుగైన వైద్యం అందేలా కృషి చేశారని కొనియాడారు. విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఆన్‌లైన్‌ క్లాసులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశాన్ని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం, సాగైన పంటలపై అధికారులు వివరించారు. రబీలో పంట దిగుబడులు కొనుగోళ్లపె నివేదికను సమర్పించారు. కొనుగోలుకు సంబంధిం చిన నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆమె సూచించారు. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ సమావేశాన్ని నిర్వహించలేదు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయా నాయక్‌, జడ్పీటీసీ సభ్యుడు హనుమంతురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:08:28+05:30 IST