వైఎస్సార్‌ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-09-03T04:47:16+05:30 IST

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సేవలు మరవలేనివని వైఎస్సార్‌ నాయకులు ఎండీ హైదర్‌అలీ, మరియమ్మ పేర్కొన్నారు.

వైఎస్సార్‌ సేవలు మరువలేనివి
భూత్పూర్‌లో వైఎస్సార్‌ చిత్రటానికి పూలమాల వేసి నివాళిఅర్పిస్తున్న యువకులు

పాలమూరు, సెప్టెంబరు 2 : దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సేవలు మరవలేనివని వైఎస్సార్‌ నాయకులు ఎండీ హైదర్‌అలీ, మరియమ్మ పేర్కొన్నారు. గురువారం వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రప టానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. 

భూత్పూర్‌ : పేదల పెన్నిది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్‌ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కో- కన్వీనర్‌ మందడి సరోజ్‌రెడ్డి అన్నారు. గురువారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  

 దేవరకద్ర : మండల కేంద్రంలో వైఎస్‌ రాజశే ఖర్‌రెడ్డి వర్ధంతిని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌, ఆర్గనైజర్‌ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి అధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  

 కోయిలకొండ : మండల కేంద్రంలోని వివేకనంద చౌరస్తాలో వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

చిన్నచింతకుంట : మండల కేంద్రంతో పాటు తిర్మలాపూర్‌ గ్రామంలో గురువారం వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. 

మూసాపేట : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మూసాపేట, అడ్డాకుల మండలాల కాంగ్రస్‌ అధ్యక్షుడు శెట్టి శేఖర్‌, నాగిరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

అడ్డాకుల : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సంద ర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

రాజాపూర్‌ : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా మండల నాయకులు ఆయన చిత్రటానికి నివాళి అర్పించారు. 

గండీడ్‌ : వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా వెన్నచేడ్‌లో సర్పంచు పుల్లారెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, నాయకులు గ్రామస్తులు  పాల్గొన్నారు.

బాదేపల్లి :  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నవాబ్‌పేట : వైఎస్సార్‌ సేవలు మరువలేనివని డీసీసీ ఉపాధ్యక్షుడు పీ.రంగారావు అన్నారు. గరువారం వైఎస్‌ వర్ధంతి సందర్భంగా రుక్కం పల్లిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  కార్యక్రమంలొ డీసీసీ ప్రధాన కార్యదర్శి బంగ్ల రవి, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు జహీర్‌ అక్తర్‌, రాంచెంద్రయ్య, ఖాజ, షభ్బీర్‌ పాల్గొన్నారు.

బాలనగర్‌ : మండల కేంద్రంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు హరిసింగ్‌, శంకర్‌నాయక్‌, దత్తత్రేయ, గణేష్‌గౌడ్‌, భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు. Updated Date - 2021-09-03T04:47:16+05:30 IST