విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-03T04:16:06+05:30 IST

మల్దకల్‌కు చెందిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆది వారం చోటు చేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మల్దకల్‌, మే 2 : మల్దకల్‌కు చెందిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన ఆది వారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్‌కు చెందిన ఈడిగ వెంకటేశ్‌ గౌడ్‌ (48)ఆదివారం   ఇంటి ముందు కొత్తగా చేపట్టిన నిర్మాణానికి నీరు పడు తుండగా మోటార్‌కు విద్యుత్‌ వైరు అందకపోవడంతో సర్వీస్‌ వైరు సరిచేయడానికి ప్రయత్నించగా ఎర్త్‌ కావడం తో విద్యుదాఘాతానికి గురై కిందపడగా తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్న హోటల్‌ నడుపుతూ జీవనం కొనసాగించే వెంకటేశ్‌ మృతిపై మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-05-03T04:16:06+05:30 IST