రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-03T04:52:14+05:30 IST

జడ్చర్ల సిగ్నల్‌గడ్డ సమీపంలో జడ్చ ర్ల-గొల్లపల్లి రైలుమార్గంలో రైలుకింద పడి హరిప్రకాశ్‌గౌడ్‌ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

జడ్చర్ల, నవంబరు 2: జడ్చర్ల సిగ్నల్‌గడ్డ సమీపంలో జడ్చ ర్ల-గొల్లపల్లి రైలుమార్గంలో రైలుకింద పడి హరిప్రకాశ్‌గౌడ్‌ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ తెలిపిన వివరాల మేరకు జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రా మానికి చెందిన హరిప్రకాశ్‌గౌడ్‌ సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరి ప్రకాశ్‌గౌడ్‌ తండ్రి యాదయ్యగౌడ్‌ అనారోగ్యంతో బాధపడు తుండడం, ఆర్థిక ఇబ్బందులతో పాటు, నూతనంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులకు డబ్బులు సరిపోకపోవడంతో మన స్థాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి తల్లితో గొడవ పడి ఇంటి నుంచి బయటికి వచ్చిన యువకుడు సిగ్నల్‌గడ్డ సమీ పంలో రైలుకింద పడి ఆత్యహత్యకు పాల్పడ్డాడని వివరిం చారు. మహబూబ్‌నగర్‌ స్టేషన్‌మాస్టర్‌ రాజీవ్‌కుమార్‌ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు కృష్ణ తెలిపారు. 

Updated Date - 2021-11-03T04:52:14+05:30 IST