వాల్మీకుల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి

ABN , First Publish Date - 2021-10-21T04:58:12+05:30 IST

వాల్మీకుల సమగ్ర అ భివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంద ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

వాల్మీకుల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 

- ఘనంగా వాల్మీకి జయంతి సభ

- పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌, అలంపూరు ఎమ్మెల్యే

- జిల్లా వ్యాప్తంగా మహర్షి చిత్రపటాలకు నివాళ్లు

గద్వాలటౌన్‌, అక్టోబరు 20 : వాల్మీకుల సమగ్ర అ భివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంద ని  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. వాల్మీ కులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో ప్రభుత్వం ఇ ప్పటికే స్పష్టమైన వైఖరిని తీసుకున్నట్లు ఎమ్మెల్యే వి వరించారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరిం చు కొని బుధవారం రాత్రి పట్టణంలోని వాల్మీకి భవనం ఆ వరణలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడారు.  సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలను అన్నివిధాలా ఆదుకునే ఉద్దేశంతోనే తొలి ప్రయత్నంగా దళితబంధును అమలు చేస్తున్న ప్రభుత్వం దశల వారీగా ఈ పథకాన్ని అన్ని వర్గాల వారికి అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సభలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకులు అన్ని రంగా ల్లో రాణించేందుకు ఐక్యంగా ముందడుగు వేయా లని సూచించారు. అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీ.ఎం. అబ్ర హాం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశానికి సంబంధించి ఇప్పటికే శాసనసభ  వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. దీంతో పాటు వాల్మీ కుల ఆర్థిక, సామాజిక  జీవన స్థితిగతుల గురించి చల్ల ప్ప కమిటీకి సమగ్రంగా వివరించామన్నారు. కా ర్యక్ర మంలో వినియోగదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు గట్టు తిమ్మప్ప, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ సరోజమ్మ, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌. కేశవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ రామేశ్వరమ్మ, గట్టు జడ్పీటీసీ బాసు శ్యామల, కౌన్సిలర్‌ మాణిక్యమ్మ, వాల్మీకి సేవా సంఘం అధ్యక్ష,ప్ర ధాన కార్యదర్శులు కోటేష్‌, మురళి, నాయకులు వైం డింగ్‌ రాములు, మధుసూదన్‌బాబు, మద్దిలేటి, శివా రెడ్డి, తదితరులు ఉన్నారు.  కార్యక్రమానికి ముందు వా ల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు జ్యోతిప్రజ్వలన చేశారు. 

 వాల్మీకి జీవిత చరిత్రను తెలుసుకోవాలి: కలెక్టర్‌

గద్వాల క్రైం : వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు తెసుకోవాలని  కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో వాల్మీకి జయంతి వేడుకలను వెను కబడిన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వా ల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, డీఎస్‌ వో రేవతి, డీపీఆర్‌వో  చెన్నమ్మ, బీసీ సం క్షేమ శాఖ సిబ్బంది బాలస్వామి, అబ్దుల్‌ హఫీజ్‌, శ్రీనివాసులు తదితరులున్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను నిర్వహించారు.  వాల్మీ కి చిత్రపటానికి జిల్లా పోలీస్‌ కార్యాలయ ఏవో సతీష్‌  పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో డీసీ ఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ నాగేందర్‌, నయిమ్‌, ఎస్‌ఐ జగదీష్‌, సీసీ లోహిత్‌ తదితరులున్నారు.



Updated Date - 2021-10-21T04:58:12+05:30 IST