ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-06T04:22:36+05:30 IST

కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసు కుంది.

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

నవాబ్‌పేట, ఫిబ్రవరి 5: కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలపరిధిలోని కొల్లూరులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం..  రంగారెడ్డిజిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కంది వనానికి చెందిన కలాల్‌ మాధవికి నవాబ్‌పేటమండలం కొల్లూర్‌కు చెందిన రఘుగౌడ్‌తో 14సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరి కాపురంలో కొంతకాలంగా కలహాలు మొద లైయ్యాయి. గురువారం కూడా భార్యభర్తలు గొడవపడ్డారు. దాంతో విసిగిపోయిన మాధవి రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న శివకుమార్‌ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఓ పాప ఉంది. 

 

Updated Date - 2021-02-06T04:22:36+05:30 IST