ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-14T03:49:28+05:30 IST

ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వేపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది.

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

  హన్వాడ, జనవరి 13: ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వేపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. నవాబ్‌పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన బోయిని కృష్ణవేణి(26)కు 10నెలల క్రితం వేపూర్‌ గ్రామానికి చెందిన సాయికుమార్‌తో వి వాహం అయింది. భర్త ఆర్మీలో పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సెల వుపై గ్రామానికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున కృష్ణవేణి ఇంట్లో ఉరేసు కొని ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాటి నుంచి భర్త, అత్త, మామ, బావ, ఆడపడుచులు వరకట్న కోసం వేధింపులకు గురి చేయడంతోనే కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  


Updated Date - 2021-01-14T03:49:28+05:30 IST