’పోలీసుల అత్యుత్సాహంతోనే చంద్రబాబుపై కేసు’
ABN , First Publish Date - 2021-05-09T03:44:13+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పోలీసులు అత్యుత్సాహంతోనే తప్పుడు కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆరో పించారు.

- తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు
అలంపూర్, మే 8: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పోలీసులు అత్యుత్సాహంతోనే తప్పుడు కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మహ బూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆరో పించారు. పోలీసులు మాటిమాటికి మాజీ సీఎంపై తప్పుడు కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శనివారం అలంపూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడిన నేత అన్నారు. అలాంటి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే లేనిపోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదని, పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే భవి ష్యత్తులో భారీమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.