గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-22T02:56:22+05:30 IST
క్రీడాకారులు గెలుపోట ములు క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని, ఓటమిని గె లుపునకు నాంది అనుకొని ముందుకెళ్లాలని వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
పెద్దమందడి, మార్చి21: క్రీడాకారులు గెలుపోట ములు క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని, ఓటమిని గె లుపునకు నాంది అనుకొని ముందుకెళ్లాలని వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. చంద్రారెడ్డి స్మారక ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని సర్పంచ్ వరలక్ష్మి సహకారంతో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ప్రారంభించి మా ట్లాడారు. క్రీడల ద్వారా కొత్త స్నేహం ఏర్పడుతుం దన్నారు. క్రీడల ద్వారా అంటే ఆరోగ్యమే కాకుండా శా రీరక దారుఢ్యం కలుగు తుందని క్రీడల్లో రాణిస్తే రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయలలో గుర్తింపు వస్తుం దన్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే క్రీడాకారులను ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని టోర్నమెంట్ కమిటీకి సూచించారు. ఎంపీపీ మేఘా రెడ్డి, జిల్లా రైతు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, సిం గిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో చైర్మన్లు సత్యారెడ్డి, మన్యపురెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, జానకిరాములు పాల్గొన్నారు.
తెలంగాణ సంక్షేమ రాష్ట్రం
వనపర్తి అర్బన్: తెలంగాణ సంక్షేమ రాష్ట్రమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని తన ని వాసంలో 421మంది లబ్ధిదారులకు ఆదివారం క ల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి అండగా ఉంటుం దన్నారు. తెలంగాణలో ఉన్నట్లు సంక్షేమ పథకాలు దే శంలో ఎక్కడా లేవన్నారు. ప్రజల ఆశీర్వాదమే రాష్ట్ర ప్రభుత్వానికి బలం, బలగం అని తెలిపారు.