అధికారుల తీరు మారదా ?

ABN , First Publish Date - 2021-06-22T04:57:18+05:30 IST

సోమవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో పాత నివేదికలను చదివి వినిపించారు.

అధికారుల తీరు మారదా ?
జడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి డీఆర్డీవో

- పాత నివేదికలు చదవడంపై జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ ఆగ్రహం

నారాయణపేట టౌన్‌, జూన్‌ 21 : సోమవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో పాత నివేదికలను చదివి వినిపించారు. చదువుతున్న క్రమంలో పాతది అని తెలుసుకొని కొత్తనివేదిక తెప్పించుకొని మళ్లీ చదివిన సంఘటన ఇది..డీఆర్డీఓ కార్యాలయం నుంచి నివేదికలను పంపించారు. ఆ నివేదిక ఇటీవల జరిగిన పనులకు సంబంధించింది కాదని, పాత నివేదికను చదువుతున్న ఇన్‌చార్జీ డీఆర్డీవో గోపాల్‌ నాయక్‌ అవాక్కయ్యారు. ఇది పాత నివేదిక కొత్త నివేదిక ఉంది ఆ వివరాలు చదివి వినిపించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానన్నారు. పాత నివేదికలు పంపించడంలో అధికారుల తీరు మారదా అని జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ అన్నారు. సోమవారం గ్రామీణాభివృద్ధి శాఖ, విద్య, వైద్య స్థాయీ సంఘాల సమావేశం జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన, స్ర్తీ, శిశు సంక్షేమ సమావేశం జడ్పీటీసీ జ్యోతి అధ్యక్షతన జరిగింది. హరితహారంలో భాగంగా రోడ్లకిరువైపులా ఎంత దూరంలో మొక్కలు నాటాలని జడ్పీ కోఆప్షన్‌ తాజుద్దీన్‌ అధికారులను అడిగారు. డీఆర్డీఓ సమాధానమిస్తూ రోడ్డు చివర నుంచి 12 ఫీట్ల దూరంలో మొక్కలు నాటాలని, ఆర్‌అండ్‌బీ అధికారులు సహకరించాల న్నారు. రోడ్డు పక్కనే గుంతలు తవ్వుతున్నారని, వాటిలో మొక్కలు నాటినా ప్రయోజనం ఉండదని, రోడ్డు విస్తరణ చేపడితే ఆ మొక్కలు తొలగించాల్సి ఉం టుందన్నారు. పీఆర్‌ఈఈ నరేందర్‌ రోడ్డు పక్కనున్న భూ యజమానులు మొక్కలు నాటేందుకు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. సీడీపీఓకు నర్వ జడ్పీటీసీ జ్యోతి ఫోన్‌ చేసి నేను స్ర్తీ, శిశు సంక్షేమ సంఘం చైర్‌పర్సన్‌ను మాట్లాడుతున్నానని అంటే మీరెవరో తెలియదని చెప్పడంపై సమావేశంలో సీడీపీఓ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఫోన్‌ నంబర్‌ కూడా ఫీడ్‌ చేసుకోకపోవడం విడ్డూరమన్నారు. ఇదిలా ఉండగా జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఎజెండాలో కేసీఆర్‌ కిట్‌కు సంబంధించి వివరాలు పొందు పరచలేదు. ఈ స్థాయీ సంఘాల సమావేశాలు మొక్కుబడిగా కొన సాగుతు న్నాయి. ఈ సమావేశాలకు జడ్పీటీసీలు అశోక్‌, వెంకటయ్య, జడ్పీ సీఈఓ సిద్రామప్ప ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.

Updated Date - 2021-06-22T04:57:18+05:30 IST