పెళ్లింట విషాదం

ABN , First Publish Date - 2021-05-20T05:40:58+05:30 IST

పెళ్లి ఇంట విషాదం నెలకొన్నది.

పెళ్లింట విషాదం
శ్రీవాణి (ఫైల్‌)

- పారాణి ఆరకముందే నవ వధువు మృతి


నాగర్‌కర్నూల్‌ క్రైం, మే 19 : పెళ్లి ఇంట విషాదం నెలకొన్నది. పారాణి ఆరకముందే నవ వ ధువు శ్రీవాణి (19) మృతి చెం దిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సంత బజా ర్‌లో చోటు చేసుకుంది. నాగర్‌ కర్నూల్‌కు చెందిన శ్రీవాణికి వి కారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన నవీన్‌కుమార్‌కు మే 14న తాండూరులో వివాహమైం ది. రెండు రోజుల అక్కడే ఉండి ఆదివారం నాగర్‌కర్నూ ల్‌లో వధువు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. మంగళవారం పట్టణంలోని ఆలయంలో అభిషేకం చేశారు. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీవాణి వాంతులు కావడంతో కొద్దిసేపటికే కుప్ప కూలింది. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీడౌన్‌, పల్స్‌ రేటు పడిపోయిందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

Updated Date - 2021-05-20T05:40:58+05:30 IST