లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-22T05:05:12+05:30 IST

లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ వెల్లడించారు.

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం: కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌, ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, వైద్యాధికారి డా.సుధాకర్‌లాల్‌

నాగర్‌కర్నూల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, జిల్లాలో కేసులు పెరగడానికి కారణాలు తెలుసుకొని నియంత్రణ కు మరింత చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 8321 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, ఇంటింటి సర్వే మొదటి దశ పూర్తి కాగా రెండవ దశ సైతం పూర్తి చేయడం జరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ డా.వై.సాయిశేఖర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సుధాకర్‌లాల్‌, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డా.శివరాం, డా.రోహిత్‌, డా.నిఖి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-22T05:05:12+05:30 IST