ఇసుక సమస్యపై రైతులతో చర్చిస్తాం

ABN , First Publish Date - 2021-12-26T05:03:58+05:30 IST

ఊకచెట్టు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల అనుమతుల అంశంపై అవసరమైతే రైతులతో చర్చిస్తా మని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు స్పష్టం చేశారు.

ఇసుక సమస్యపై రైతులతో చర్చిస్తాం

- కేసులపై ఎస్పీతో మాట్లాడతా  

- ఊకచెట్టు వాగు లూటీ కథనంపై స్పందించిన కలెక్టర్‌

- ఇసుక మేటలున్న చోటే తవ్వకాలకు అనుమతి 

  మహబూబ్‌నగర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఊకచెట్టు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల అనుమతుల అంశంపై అవసరమైతే రైతులతో  చర్చిస్తా మని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు స్పష్టం చేశారు. ‘ఊక చెట్టు వాగు లూటీ’ శీర్షికన శనివారం ఆంరఽధ జ్యోతిలో ప్రచురిత మైన కథనంపై కలెక్టర్‌ స్పందించారు. ఊకచెట్టు వాగు ఇసుక తవ్వకాల అంశంపై ఇటీవల వస్తోన్న పోలీసు కేసులు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి జిల్లా ఎస్పీతో చర్చిస్తామని వెల్లడించారు.  చిన్నచింత కుంట మండలం ముచ్చింతల సమీపంలోని ఊకచెట్టు వాగులో ఇసుక తవ్వకానికి ప్రభుత్వరంగ సంస్థ టీఎస్‌ఎండీసీకి ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వుల ప్రకార మే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చామని పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ప్రభుత్వ పనులు, సామాన్య ప్రజ లకు అవసరమైన ఇసుక సరఫరా చేసేందుకు అనుమతించా మని పేర్కొన్నారు. అయిదు శాఖల అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, ఇచ్చిన నివేదిక మేరకే అనుమతులిచ్చామని, సమీ పంలోని చెక్‌డ్యామ్‌ వెనక భాగంలో ఉన్న ఇసుకమేటల నిల్వల్లోనే తవ్వకాలు జరపాలనే సూచనలతోనే అనుమతులున్నాయని వెల్ల డించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలపై గతంలో రైతులిచ్చిన అభ్యం తరాల మేరకు ఆరు మాసాల పాటు తవ్వకాలు నిలిపివేశామని, మరోసారి సీనియర్‌ స్థాయి అధికారితో పునర్విచారణ చేయించిన తర్వాతే భూగర్భ జలాలకు, ఇతరాత్ర ఎలాంటి ఇబ్బంది ఉండదనే నివేదిక ఆధారంగానే చెక్‌ డ్యామ్‌ వెనక పేరుకుపోయిన ఇసుక మేటల నుంచి  తవ్వకానికి అనుమతించామని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-26T05:03:58+05:30 IST