మంత్రి అవినీతిపై కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తాం

ABN , First Publish Date - 2021-07-09T04:51:55+05:30 IST

వ్యవసాయశాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి అవినీతిపై సీఎం కేసీఆర్‌, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు పేరాల శేఖర్‌ అన్నారు.

మంత్రి అవినీతిపై  కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేఖర్‌

 బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌ 

వనపర్తి అర్బన్‌, జూలై 8:వ్యవసాయశాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి అవినీతిపై సీఎం కేసీఆర్‌, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు పేరాల శేఖర్‌ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో గురువా రం ఆయన విలేకరుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంజన్‌రె డ్డి మంత్రి పదవి చేపట్టాక జిల్లాలో ఆయన అనుచ రులు  ఎక్కడ భూములు కని పించినా గద్దల్లా వాలి పోతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని భూమితో పాటు, శ్రీరంగాపూర్‌లో ఉన్న భూముల అవినీతిపై త్వరలోనే ఆధారాలతో గవర్నర్‌, సీఎం కేసీఆర్‌కు  ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంత్రి కానాయిపల్లి, బండరావి పాకుల నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టకుండా తన సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టా రని మండిపడ్డారు.  దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలో రాష్ట్రంలో 5వేలకు పైగా ఇండస్ట్రీయ ల్‌ లోన్లు ఇచ్చామన్నారు. జిల్లాలోనే 33 మందికి ఈ లోన్లు ఇచ్చామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి బంగారు శృతి, జిల్లా ఇన్‌చార్జి ప్రతాప్‌, జిల్లా అధ్య క్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు అశ్వత్థామారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ, సబిరె డ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నారాయ ణ, మాధవరెడ్డి, రామన్‌గౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతి నిధి శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరర్‌రెడ్డి, సీతారా ములు, జిల్లా కార్యదర్శి పరశురాం, పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి రాములు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:51:55+05:30 IST