అసమానతలు లేని సమాజం కావాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2021-05-03T03:41:14+05:30 IST

అసమానతలు లేని సమాజం కావాలని సీఐటీయూ, బీసీడబ్ల్యూ నాయకులు ఎన్‌.కురుమూర్తి, వి.గాలెన్నలు ఆకాంక్షించారు.

అసమానతలు లేని సమాజం కావాలి: సీఐటీయూ
పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరిస్తున్న కార్మికులు

పాలమూరు, మే 2: అసమానతలు లేని సమాజం కావాలని సీఐటీయూ, బీసీడబ్ల్యూ నాయకులు ఎన్‌.కురుమూర్తి, వి.గాలెన్నలు ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలో మేడే వారోత్సవా ల్లో భాగంగా పాత పాలమూరులో మేడే జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నిర్మాణరంగం కార్మికులు ఏళ్ల తరబడి పోరాడిన ఫలితంగా సమగ్ర చట్టం వస్తే దానిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను యజమానుల కు అనుకూలంగా బీజేపీ మార్చిందన్నారు. కార్మి కులంతా సమసమాజ నిర్మాణం కోసం పాటుపడ దామన్నారు. కార్మిక కర్షక దినంగా మేడేను జరు పుకుంటున్నట్లు ప్రకటించారు. కోవిడ్‌ నిబంధన లు పాటిస్తూ జెండా ఆవిష్కరణ చేశామన్నారు. 135 ఏళ్ల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల చేసిన పోరాటంతో అమరులైన వారి స్ఫూర్తితో మేడే ఏర్పడిందన్నారు. పోరాడి సాధిం చుకుని ఎనిమిది గంటల పని దినాలను నేటి బీజేపీ ప్రభుత్వం పెంచటం, కార్మిక చట్టాలను కుదించటం భయంకరమైన మోసమన్నారు. కరో నా సమయంలో ప్రతి కుటుంబానికి రూ.7500, పది కేజీల బియ్యం అందజేస్తూ కరో నాను ఆరో గ్యశ్రీలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో ఈదయ్య, ఈశ్వరయ్య, కేశవులు, విశ్వనాథ్‌, ఎస్‌.కె దావీదు, ప్రశాంత్‌, నరసింహులు, భరత్‌, విష్ణు తదితరు లు పాల్గొన్నారు. 

కార్మికులను తిరోగమనానికి నెడుతున్న పాలకులు

కార్మిక వర్గాన్ని ప్రభుత్వాలు తిరోగమనం వైపు తీసుకువెళుతున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాంమ్మోహన్‌ ఆవేదన వ్య క్తం చేశారు. ఆదివారం పట్టణంలోని వీరన్నపేట లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సంబరాల ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మి కలోకానికి తీరని అన్యాయం చేస్తోందన్నా రు. చికాగో నగరంలో ఎనిమిది గంటల పని ది నాల కోసం కార్మికులు బలి దానాలు చేశారన్నా రు. నేడు దానిని 12గంటల పని దినాలుగా మార్చేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైందని అన్నారు. కార్మికవర్గం, ట్రేడ్‌ యూనియన్లు ముక్త కంఠంతో కేంద్రం తీరును వ్యతిరేకిస్తుంటే పెడచె విన పెట్టడం సరికాదన్నారు. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేసేందుకు సిద్ధమవటం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కె.జగదీష్‌, వి.లక్ష్మణ్‌, కె.బాలస్వా మి, శంకర్‌, వెంకట్రాములు, రాము, భాస్కర్‌, అంజి, మహిమూదా బేగం, రామాదేవి, లక్ష్మి, హారమ్మ, బాలమణి, అబేదా బేగం, అనురాధ, చంద్రకళ, సహీమ్‌బేగం, హీనా పాల్గొన్నారు. Updated Date - 2021-05-03T03:41:14+05:30 IST