పాఠశాలల్లో ‘వృక్షాబంధన్‌’

ABN , First Publish Date - 2021-08-22T04:36:44+05:30 IST

హరితహారంలో భాగంగా పాఠశాలల్లో పెంచుతున్న మొక్కలకు ఉపాధ్యాయులు రాఖీ కట్టి వృక్షాబంధన్‌ ని ర్వహించాలని డీఈవో రవీందర్‌ పేర్కొన్నారు.

పాఠశాలల్లో ‘వృక్షాబంధన్‌’
మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఉన్న వేపకొమ్మకు రాఖీ కడుతున్న డీఈవో రవీందర్‌

- మొక్కలు మనకు రక్ష, మనం మొక్కలకు రక్షకులుగా ఉండాలి : డీఈవో

కొత్తకోట, ఆగస్టు 21: హరితహారంలో భాగంగా పాఠశాలల్లో పెంచుతున్న మొక్కలకు ఉపాధ్యాయులు రాఖీ కట్టి వృక్షాబంధన్‌ ని ర్వహించాలని డీఈవో రవీందర్‌ పేర్కొన్నారు. మండలంలోని అమ డబాల శివారులోని మోడల్‌ స్కూల్‌ను శనివారం ఆయన  సందర్శిం చారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లా డుతూ మనవ మనుగడకు చెట్లే ఆధారమని, అం దుకోసం పాఠశాలలోని మొక్కలను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. చెట్లకు రాఖీలు కట్టి మొక్కలు మనకు రక్ష, మనము మొ క్కలకు రక్షకులుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గాయత్రి, హరితహారం అండ్‌ జాతీ య హరితదళం కోఆర్డినేటర్‌ సుదర్శన్‌రావు, మదనాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి, ఉపాధ్యాయులు తది తరులు పాలొ ్గన్నారు. 

వీపనగండ్లలో..

వీపనగండ్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం వృక్ష రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రీన్‌కోర్‌ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వృక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని డీఈవో ఆదేశించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణలో పెంచే చెట్లకు  చెట్లకు పర్యావరణ మిత్ర పదార్ధాలతో తయారు చేసిన రాఖీ లను కట్టినట్లు ఆయన తెలిపారు. మానవ మనుగడకు ఎంత దోహ దం చేసే చెట్లను ప్రతీ ఒక్కరు రక్షించాలని కోరారు. కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయులు గీతాంజలి, జ్ఞానేశ్వర్‌, సీఆర్పీ వెంకటేష్‌, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-08-22T04:36:44+05:30 IST