వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత
ABN , First Publish Date - 2021-01-13T03:14:28+05:30 IST
స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత అని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు.

వనపర్తి పురపాలకం/ రూరల్/ పాన్‌గల్/ కొత్తకోట/ రేవల్లి/ పెబ్బేరు/ గోపాల్‌పేట/ మదనాపురం/ ఆత్మకూర్/ అమరచింత/ పెద్దమందడి, జనవరి 12: స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత అని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. స్థానిక వివేకానంద చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మా లలు వేసి నివాళి అర్పించారు. మునిసిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్, డీఎస్పీ కిరణ్, డాక్టర్ చల్మారెడ్డి పాల్గొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాలలో వివేకానంద జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జింకల కృష్ణయ్య, భూజల వెం కటేశ్వర్‌రెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, అనుజ్ఞారెడ్డి, పెద్దిరాజు, వెంకటరమణ, కాటమోని శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. పాన్‌గల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్ర ప టానికి పూల మాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. గాంధీ విగ్రహం దగ్గర వి వేకానంద యూత్ సభ్యులు వివేకానంద జయంతిని నిర్వహించారు. సూపరిం టెండెంట్ విశ్వేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు బాలస్వామి, నాగేష్ నాయుడు, ఏపీవో కురుమయ్య, మాజీ సర్పంచ్ నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు. కొత్తకోట బస్టాండ్ ఎదురుగా ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ఎంపీపీ గుంతమౌనిక, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, బోయోజ్, భరత్ భూషణ్, రాములు యాదవ్, రాంమోహన్‌రెడ్డి, బాబురెడ్డి, లింగేశ్వర్, చక్రవర్తిగౌడ్ పాల్గొన్నారు. రేవల్లి మండలంలోని నాగపూర్‌లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. అజయ్‌గౌడ్, ఒగ్గు పరశురాముడు, ఎక్కే జములయ్య, శ్రీశైలం, మల్లేష్ ఉన్నారు. పెబ్బేరులోని సుభాష్ చౌరస్తా, మునిసిపల్ కార్యాలయంలో వివేకానంద జయంతిని నిర్వహించారు. మునిసిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, వేమారెడ్డి, క్రాంతి, బుచ్చన్న, శివ, నరసింహనాయుడు, రామకృష్ణ, అమర్ పాల్గొన్నారు. గోపాల్‌పేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో వివేకానంద జయంతిని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. మదనాపురంలో టీఆర్‌ఎస్ యూత్ నాయకులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివకుమార్, రవికుమార్, మన్యంయాదవ్, కుమార్, రమేష్‌యాదవ్, రాజశేఖర్, రాఘవేంద్ర, అశోక్ పాల్గొన్నారు. ఆత్మకూరు, అమరచింత, పెద్దమం దడి స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు అన్నారు. మంగళవారం ఆత్మకూర్‌లోని వివేకానంద విగ్రహానికి, పెద్దమందడిలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో చిత్రపటానికి, అమరచింతలో ఇండియన్ రెడ్ క్రాస్, ఏబీవీపీ, ఆధ్వర్యంలో జెండా కట్ట దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేశారు.
