క్షణాల్లోనే అప్రమత్తమైన పోలీసులు
ABN , First Publish Date - 2021-05-09T04:20:00+05:30 IST
ఉన్నట్టుండి జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో టప్ మనే పెద్ద శబ్దాలు వచ్చాయి. బ్యాంకు సైరన్ మోత మోగింది. ఇంతలోనే బ్యాంకు పక్కనే వారు అప్రమ త్తమై డయల్ 100కు కాల్ చేశారు.

నారాయణపేట క్రైం, మే 8 : ఉన్నట్టుండి జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో టప్ మనే పెద్ద శబ్దాలు వచ్చాయి. బ్యాంకు సైరన్ మోత మోగింది. ఇంతలోనే బ్యాంకు పక్కనే వారు అప్రమ త్తమై డయల్ 100కు కాల్ చేశారు. పెట్రోలింగ్‌లో ఉన్న డయల్ 100 పోలీస్ సిబ్బంది, బీట్ డ్యూటీ పోలీసులు క్షణాల్లోనే రాత్రి 11గంటల20 నిమిషాలకు సివిల్‌లైన్ మార్గంలోని ఏపీజీవీబీ బ్యాంకును నాలుగువైపుల నుంచి చుట్టుముట్టారు. బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ప్రవేశించి డబ్బుల చోరీకి యత్నించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో అప్రమత్తమై వెం టనే బ్యాంకు మేనేజర్‌కు ఫోన్లో సమాచారం అందించారు. ఇంతలోనే బ్యాంకు మేనేజర్ సంఘ టనా స్థలానికి చేరుకొని బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. బ్యాంకులో అమర్చిన బ్యాటరీ కార ణంగా లేదా టెక్నికల్ సమస్యతో బ్యాంకు సైరన్ మోగిందని, బ్యాంకులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆనవాలు లేవని పోలీసులకు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.