భూ రిజిస్ర్టేషన్‌పై విజిలెన్స్ విచారణ
ABN , First Publish Date - 2021-01-21T03:36:46+05:30 IST
గద్వాల సహకారం సంఘానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటనపై బుధవారం గద్వాలలో విజిలెన్స్ అ ధికారులు విచారణ నిర్వహించారు.

గద్వాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : గద్వాల సహకారం సంఘానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటనపై బుధవారం గద్వాలలో విజిలెన్స్ అ ధికారులు విచారణ నిర్వహించారు. భూ రిజిస్ర్టేషన్‌పై సం ఘం చైర్మన్ సుభాన్ చేసిన ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసు కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధి కారులు విచారణ చేపట్టారు. రిజిస్ట్రార్, సహకార సంఘం కా ర్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన వారి వివరాలను కూడా సేకరించారు.