బాధితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-01-01T04:40:15+05:30 IST

గ్యాస్‌ పైపు లైన్‌ వేయడం వలన గిరిజనులు భూములు కోల్పోతున్నారని, నష్టపోతున్న బాధితులకు వెం టనే న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి ఎండీ జబ్బార్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు.

బాధితులకు న్యాయం చేయాలి
మంత్రిని కలిసి పైప్‌లైన్‌ గురించి వివరిస్తున్న బాధితులు, బీఎస్‌పీ నాయకులు

వనపర్తి టౌన్‌, డిసెంబరు 31: గ్యాస్‌ పైపు లైన్‌ వేయడం వలన గిరిజనులు భూములు కోల్పోతున్నారని, నష్టపోతున్న బాధితులకు వెం టనే న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి ఎండీ జబ్బార్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. పట్టణ సమీపంలోని సర్వేనెంబర్‌ 331, 107, 108లో గిరిజనుల భూములు ఉన్నాయని, రోడ్డు పక్కనే దాదాపు 50 మంది నిరుపేదల ప్లాట్లు కూడా ఉన్నాయని తెలిపారు. గిరిజన భూము ల్లో, పేదల ప్లాట్లలో నుంచి హిందుస్థాన్‌ పెట్రో లియం కంపెనీ పైపులైన్‌ వేస్తున్నారని పేర్కొ న్నారు. డిసెంబరు 24 నుంచి బాధితులు, పార్టీ లు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చే స్తున్నారని, జిల్లా కలెక్టర్‌ తక్షణమే కంపెనీ య జమానులతో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 

 పైపులైన్‌ పనులు ఆపాలి: బీఎస్పీ

గిరిజన భూముల్లో వేస్తున్న హిందుస్థాన్‌ పెట్రోలియం పైపులైన్‌ పనులు తక్షణమే ఆపా లని బాధితులతో కలిసి బీఎస్పీ  నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ దేశ చరిత్రలో భూపాల్‌ గ్యాస్‌ లీకేజీలో వేలాది మంది చని పోయారని, అనేక మంది నష్టపోయారని, విశాఖపట్నంలో గ్యాస్‌ లీకేజీల్లో అనేక మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. వనపర్తి పట్టణంలో పైప్‌లైన్‌ వేయడం వల్ల ఎప్పుడైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, తక్షణ మే పనులు ఆపాలని, బాధితులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. 



Updated Date - 2022-01-01T04:40:15+05:30 IST