వరాలనిచ్చే వరలక్ష్మీ నమోస్తుతే

ABN , First Publish Date - 2021-08-21T04:57:42+05:30 IST

వరాలనిచ్చే వరలక్ష్మీ మమ్ము ఆదుకోవ మ్మా! అంటూ మహిళలు అమ్మవారిని వేడుకు న్నారు

వరాలనిచ్చే వరలక్ష్మీ నమోస్తుతే
బీచుపల్లి కోదండరామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలు

    గద్వాల టౌన్‌/ ఇటిక్యాల/ అయిజ/ అలంపూర్‌ ఆగస్టు 20 : వరాలనిచ్చే వరలక్ష్మీ మమ్ము ఆదుకోవ మ్మా! అంటూ మహిళలు అమ్మవారిని వేడుకు న్నారు. వ్రతం ఆచరించి పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లాలోని దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. 

- గద్వాల పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ, పాతహౌసింగ్‌ బోర్డు కాలనీలోని అన్న పూర్ణేశ్వరి, వెంటకరమణ కాలనీలోని నందీశ్వరి, పాండురంగ, నల్లకుంట శివాలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో కుంకుమార్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. 


- ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఉన్న కోదండ రామాలయంలో అర్చకుడు నరసింహాచారి ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు తరలివచ్చి వ్రతంలో పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 22న లక్ష్మీహయగ్రీవ ఆలయంలో కల్యాణ వేడుక నిర్వ హిస్తున్నట్లు అలయ మేనేజరు సురేంద్రరాజు ఒకప్రకటనలో తెలిపారు. 


- అయిజ పట్టణంలో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అమ్మవారిని పువ్వులతో అలంకరించి పూజలు చేశారు. సాయం త్రం ముత్తయిదువులకు చీర, సారే, పుసుపు, కుంకుమలతో సారె ఇచ్చిపుచ్చుకున్నారు. 


జోగుళాంబ ఆలయంలో భక్తుల సందడి 

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబదేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకు మార్చన, చండీహోమం నిర్వహించారు. హైదరా బాద్‌కు చెందిన బాలశేఖర్‌, శ్రీలక్ష్మి దంపతులు అమ్మవారికి 44 గ్రాముల బంగారు నక్షత్ర హారం, 413 గ్రాముల వెండిపళ్లెం చేయించారు. వాటి ని ఆలయ ధర్మకర్త సరై నాగరాజుకు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. 

Updated Date - 2021-08-21T04:57:42+05:30 IST