వనపర్తికి మెడికల్‌ కళాశాల

ABN , First Publish Date - 2021-05-19T03:56:55+05:30 IST

వనపర్తి జిల్లాకు వైద్య కళాశాల యోగం వరించనుంది. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్య టించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వన పర్తిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీనిచ్చారు.

వనపర్తికి మెడికల్‌ కళాశాల
వనపర్తి జిల్లా ఆస్పత్రి

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 8 2018 ఎన్నికల ప్రచారంలో హామీ

300 పడకలతో ఆస్పత్రి, నర్సింగ్‌ కళాశాల భవనం

150 సీట్లతో 19 డిపార్ట్‌మెంట్ల ఏర్పాటుకు అవకాశం


ఆంధ్రజ్యోతి, మే 18, వనపర్తి: వనపర్తి జిల్లాకు వైద్య కళాశాల యోగం వరించనుంది. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్య టించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వన పర్తిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీనిచ్చారు. సోమవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో వనపర్తిలో కళాశాల ఏర్పాటకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండగా, వనపర్తిలో రెండోది ఏర్పాటు కానుంది. కాలేజీతోపాటు నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గతంలో ఉన్న కళాశాలల వద్ద కూడా ఈ నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు కా నున్నాయి. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో ఆ జిల్లాతోపాటు నారాయణపేట జిల్లాకు వైద్యసేవలు అందించే సామర్థ్యం పెరిగింది. అ యితే జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు మహబూ బ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం, వైద్య సేవల కోసం కర్నూలు, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మెడికల్‌ కాలేజీ వస్తే ఆస్పత్రిలో పడకల సామ ర్థ్యం పెరిగి, మెరుగైన వైద్యసేవలు కూడా అందుతాయనే డిమాండ్‌ చాలాకాలం నుంచి ఉంది. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయడం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆస్పత్రి మంజూరైతే దాంతో మెడికల్‌ కళాశాల వస్తుందని ఆశించారు. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది. 

దక్షిణ పాలమూరుకు మేలు: రాష్ట్రంలోని వివిధ మెడికల్‌ కాలేజీలు 50, 100, 150, 200, 250 ఎంబీబీఎస్‌ సీట్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఆయా ప్రాంతాల జనాభా, ఇతర వైద్య సదు పాయాల ఆధారంగా సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. పాలమూరు మెడికల్‌ కాలేజీలో 150 సీట్లు ఉండగా.. వనపర్తిలో కూడా అంతే సామర్థ్యంతో కళాశాలను ఏర్పాటు చేసే అవకాశా లున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వసతుల దృష్ట్యా మొదట్లో 300 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసిన తర్వాత, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కేటాయింపుల ఆధారంగానే సీట్లను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ అందుకు తగ్గ వసతులు కల్పించ లేదు. అయితే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే క్యాంపస్‌ కోసం దాదాపు 22 ఎకరాల స్థలం, హాస్టళ్లు, లైబ్రరీ ఇతర వసతుల కల్పన కోసం మరో 10 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని పెంచడం ఆసాధ్యం. అక్కడ స్థల ప్రభావం సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా స్థలం గుర్తించి.. అందులో నూతనంగా ఆస్ప త్రిని డెవలప్‌ చేయనున్నట్లు తెలు స్తోంది. దానికి అనుంబంధంగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయ నున్నారు. మెడికల్‌ కళాశాలలో మొత్తం 19 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తారు. ల్యాబ్‌లు, లైబ్రరీలు ఇలా సకల హంగులను కల్పించనున్నారు. ప్రస్తుతం రూరల్‌ తెలంగాణలో ఆది లాబాద్‌, మహబూబ్‌నగర్‌, సూర్యా పేట, సిద్దిపేటలలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. తాజాగా వన పర్తితోపాటు మరో అయిదు జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు కాను న్నాయి. వనపర్తి కళాశాల ఏర్పాటు వల్ల దక్షిణ పాలమూరు జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది.

ట్రామా కేసులకు ఉపయోగం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 180 కిలో మీటర్ల మేర జాతీయ రహ దారి ఉంది. తాజాగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రం గుండా మరో జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. సాధార ణంగా జాతీయ రహదారులపై ప్రమా ాలు ఎక్కువగా సంభవిస్తుం టాయి. స్వల్ప గాయాలు అయితే స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స అందుతున్నప్పటికీ.. సీరియస్‌ ట్రామా కేసులకు చాలా ఇబ్బందికర పరిస్థి తులు ఏర్పడు తున్నాయి. హైదరాబాద్‌, మహబూ బ్‌నగర్‌, కర్నూలు ఆస్పత్రులకు తర లించాల్సి వస్తోంది. అయితే పరిస్థితి విషమించి చాలా మంది మార్గం మధ్యలోనే మరణి స్తున్నారు. జోగు ళాంబ గద్వాల జిల్లా పుల్లూరు నుంచి మొదలుకుని కొత్తూ రు వరకు ఉమ్మ డి పాలమూరు జిల్లాలో జాతీయ రహదారి 44 ఉంది. అయితే అడ్డా కుల, మూసాపేట దాటి తే మహబూ బ్‌నగర్‌కు హుటాహుటిన తరలించే అవకాశం ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి పరి ధిలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇబ్బంది అవు తోంది. ఈ నేపథ్యంలో వనపర్తిలో మెడికల్‌ కళాశాల ఏర్పా టైతే దానికి అనుబంధంగా ఏర్పాటు కానున్న 300 పడకల ఆస్పత్రిలో ట్రామా కేసులకు సరైన సమయంలో వైద్యం అందనుంది.

సంక్షేమానికి కేరాఫ్‌

సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రం నిలు స్తోందని, తెలంగాణ నవ నిర్మాణం పై 2001 నుంచే సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తికి మెడికల్‌ కళాశాల మంజూరుపై సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదా లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ర్టాన్ని ఏడేళ్లలో ఆకలిచావుల నుంచి అన్నపూర్ణగా మార్చారని అన్నారు. కరోనా విప త్తులోనూ వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణేనని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్యం పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉండాల న్నదే కేసీఆర్‌ ఆలోచన అని, అం దులో భాగంగానే గతంలో ఆదిలా బాద్‌, మహబూబ్‌నగర్‌, సూర్యా పేట, సిద్దిపేటలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. తాజా గా వనపర్తితో కలిపి ఆరు మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేయడం దేశానికే ఆదర్శమన్నారు. మెడికల్‌ కళాశాలకు 300 పడకల ఆస్పత్రి తోపాటు నర్సింగ్‌ కళాశాలకు మరో ఆస్పత్రి అవసరమని తెలిపారు. వనపర్తిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు దక్షిణ పాలమూరు జిల్లాకు ఉపయోగకరమని అన్నారు.

Updated Date - 2021-05-19T03:56:55+05:30 IST