వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-10-29T04:28:26+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మనూచౌదరి గ్రామ సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు, గ్రామాల వైద్యాధికా రులకు, సిబ్బందికి సూచించారు.

- అదనపు కలెక్టర్ మనూచౌదరి
తెలకపల్లి, అక్టోబరు 28 : కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మనూచౌదరి గ్రామ సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు, గ్రామాల వైద్యాధికా రులకు, సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని బొప్పల్లి, వట్టిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నివారణ వ్యాక్సినేషన్ మీ గ్రామాలలో తక్కువగా ఉన్నదని, వెంటనే శ్రద్ధ వహించి వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు తీసుకోని వారికి వేయించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాలలో హరితహారం, గ్రామాల స్వచ్ఛత, శుభ్రత పాటించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసే లక్ష్యంతో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలన్నారు. అనంతరం బొప్పల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులకు, సిబ్బందికి సమావేశం నిర్వహించి పలు సూచ నలు చేశారు. కరోనా నియంత్రణలో వ్యాక్సినేషన్ కొనసాగింపులో గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల స్థాయి అధికారులు, వైద్యాధికారు లు, సిబ్బంది కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఇప్పటికీ టీకా తీసుకోని వారిని గు ర్తించి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. ఎంపీడీవో అజార్‌మైనొద్దీన్, వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్, సర్పంచ్‌లు పరుశరాములు, శృతి, వార్డు సభ్యులు, వైద్య సిబ్బందిపాల్గొన్నారు.