వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T04:35:17+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు.

వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మనూచౌదరి

 తాడూరు, డిసెంబరు 7 :  కరోనా వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలని  అదనపు కలెక్టర్‌ మనూచౌదరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆశకార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9నుంచి జరిగే స్పెషల్‌ డ్రైవ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండ వ డోస్‌ గురించి, లబ్ధిదారుల గురించి మెడికల్‌ ఆఫీసర్‌ సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ కార్యకర్తలు గ్రామాల్లో చురుకుగా పని చేసి రెండవ విడత డోస్‌ను రెండు నెలల్లో వందశాతం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఏఎన్‌ఎంలు ఉదయం 8గంటల నుంచి రాత్రి 10గంటల వర కు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆయన అన్నారు.  కార్యక్ర మంలో ఎంపీడీవో గంగమోహన్‌, తహసీల్దార్‌ చక్రవర్తి, వైద్య సిబ్బంది శ్రీనివాసులు, చారి, రాజే శ్వరి, ఆశ కార్యకర్తలు  పాల్గొన్నారు. 

‘ప్రత్యేక దృష్టి సారించాలి’        

వంగూరు:  కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తహసీల్దార్‌ రాజు నా యక్‌ అన్నారు. మంగళవారం వంగూరులోని రెవెన్యూ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పై వీఆర్‌వో, వీఆర్‌ఏ, రేషన్‌ డీలర్లుకు సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌  మాట్లాడుతూ మం డలంలో 6 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలను పర్యవేక్షించడానికి అధికారులను నియమించామన్నారు.  ఈ నెల 31 వరకు వందశాతం వ్యాక్సినేషన్‌కు  కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్‌ నాయక్‌, డీటీ సుదర్శన్‌రెడ్డి, ఏవో తనూజ, ఏఈ మణిపాల్‌నాయక్‌, సీహెచ్‌వో సుధాకర్‌,  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:35:17+05:30 IST