సబ్సిడీ రుణాలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-29T05:39:25+05:30 IST

ప్రభు త్వం అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ హరిచందన జిల్లా ప్రజలను కోరారు.

సబ్సిడీ రుణాలు వినియోగించుకోవాలి
రుణ మేళాను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 28 : ప్రభు త్వం అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ హరిచందన జిల్లా ప్రజలను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ మేళా కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నా వాటిని ఎలా పొందాలో సరైన అవ గాహన లేకపోవడంతో చాలా మంది లబ్ధి పొందలేక పోతున్నారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలు ఎలా పొందవచ్చు, అర్హత ఏమిటి, ఎలాంటి రుణాలు సబ్సిడీ ఉన్నాయి. అనే పూర్తి వివరాలు రుణ మేళాలో వివరించడం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పడ్డాక ఇది మొదటి రుణ మేళా అని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలు ఒకే రకం వ్యాపారాలకై రుణం తీసుకోవడం వల్ల ఏ ఒక్క సంఘం అభివృద్ధి చెందే అవకాశం ఉండదన్నారు. ఒక్కోక్కరు ఒక్కోరకమైన ఆలోచనతో వాళ్లలో ఉన్న నైపుణ్యాలను బట్టి రుణాలకు ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు. మేళాకు వచ్చిన వారికి సబ్సిడీ గురించి వివరించి వెంటనే రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం నటరాజన్‌, జీఎం డీఐసీ రాంసుబ్బారెడ్డి, ఎల్డీఎం ప్రసన్న కుమార్‌, ఏజీఎం ఎస్‌బీఐ శ్రావణ్‌, డీజీఎం డీసీసీబీ కృష్ణ ప్రసాద్‌, ఏజీఎం ఏపీజీవీబీ సుభాష్‌, ఎస్‌కే ప్రసాద్‌, డీజీఎం కెనరా బ్యాంక్‌ శ్రీనివాసన్‌ మూ ర్తి, శేషి రంజన్‌వర్మ, జిల్లా అధికా రులు రషీద్‌, డీఆర్డీవో గోపాల్‌, కన్యాకుమారి పాల్గొన్నారు. 


హ్యాండి క్రాప్ట్‌ ఉత్పత్తులను పరిశీలించిన కలెక్టర్‌


నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలు తయారు చేసిన హ్యాండి క్రాప్ట్‌ ఉత్పత్తులను కలెక్టర్‌ హరిచందన పరిశీలించారు. అనంతరం డీఆర్డీవో గోపాల్‌నాయక్‌, కేవైసీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సమాఖ్య సమావేశానికి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. జీవనోపాధి కింద పేట మండలానికి చింతపండు, దామరగిద్ద, మక్తల్‌కు దాల్‌మిల్‌ యూనిట్‌, మద్దూర్‌ మండలానికి గానుగ ఆయిల్‌ ఫామ్‌, దాల్‌మిల్‌ను కలెక్టర్‌ మంజూరు చేశారు. సమావేశంలో ఏపీఎం, డీ పీఎంలు మాసన్న, దామోదర్‌, ఆనందం, రామునాయక్‌ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:39:25+05:30 IST