ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2021-10-21T05:13:22+05:30 IST
రైతులు రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చసుకోవాలని ఎమ్మెలే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ఊట్కూర్, అక్టోబరు 20 : రైతులు రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని సద్వినియోగం చసుకోవాలని ఎమ్మెలే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కుర్వగేరి వీధిలో బుధవారం తెలంగాణ రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రంలో విత్తనాలు, యూరియా, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు సరైన ధరల్లో లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ అశోక్‌గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శివరామరాజు పాల్గొన్నారు.
బీటీ రోడ్డు పనుల పరిశీలన
మక్తల్ రూరల్ : బీటీ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని దండు వద్ద జాతీయ రహదారి 167 పనులను పరిశీలించి కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. అంతకుముందు మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు.