బాధ్యతాయుతంగా పని చేయాలి
ABN , First Publish Date - 2021-11-27T04:53:35+05:30 IST
పోలీస్ స్టేషన్లో ప్రతీ ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు.

- ఎస్పీ రంజన్ రతన్ కుమార్
- ఉండవల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ
ఉండవల్లి, నవంబరు 26 : పోలీస్ స్టేషన్లో ప్రతీ ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్ తదితర రికార్డులను తనిఖీ చేశారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో ఆరా తీశారు. వాటి పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 94 శాతం వరకు కేసుల రికవరీ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రం సరిహద్దు కావడంతో కర్నూలు నుంచి ఎక్కువ మంది మద్యం కొనుగోలు కోసం అలంపూర్ చౌరస్తాకు వస్తున్నార ని అన్నారు. ఇటీవల దొంగతనాలు జరిగాయని, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశిం చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పోలీస్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు ఫోర్ జి (గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాం బ్లింగ్)పై అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల భూముల ధరలు అమాంతం పెరగడంతో తగాదాలు ఎక్కువయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విలేజ్ పోలీసింగ్ మానిటరింగ్‌ను ఏర్పాటు చేసిం దని, అందులో భాగంగా ప్రతీ గ్రామానికి ఒక పోలీస్ అధికారి, సర్పంచు, ప్రజా ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ మంగళవారం గ్రామంలో సమావేశం నిర్వహించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిం చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం సరిహద్దులో ఉన్న ఉండవల్లి పోలీస్‌స్టేషన్ కీలకమైందన్నారు. స్వంత భవనం లేక ప్రజలు, సిబ్బంది ఇబ్బంది పడ్తున్నారని చెప్పారు. స్టేషన్లో బ్యారక్‌లు, సిబ్బందికి క్వార్టర్లు లేవని అన్నారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ చేసి స్వంత భవనం నిర్మించాలని ఉన్నతా ధికారులకు తెలియజేయనున్నట్లు చెప్పారు. కార్య క్రమంలో సీఐ సూర్యానాయక్, ఎస్ఐ జగన్ మోహన్, ట్రైనీ ఎస్ఐ జగదీష్ పాల్గొన్నారు.