నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు

ABN , First Publish Date - 2021-07-29T04:38:55+05:30 IST

నారాయణపేట జిల్లా లో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు

నారాయణపేటటౌన్‌, జూలై 28 : నారాయణపేట జిల్లా లో మరో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మ ద్దూర్‌ మండలంలో కొత్తపల్లి, కోస్గి మం డలంలో గుండుమాల్‌ గ్రామాలను కొత్త మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయను న్నారు. ఇప్పటికే జిల్లాలో 11 మండ లాలు ఉండగా ఈ రెండింటితో కలిపి 13 మండలాలు కానున్నాయి. మద్దూ ర్‌ మండలం అతిపెద్దగా ఉండడం అందులో కొన్ని గ్రామాలతో మం డలంగా ఏర్పాటు చేసేం దుకు అర్హత కల్గి ఉండడంతో ప్రజ లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కొడంగల్‌ ఎ మ్మెల్యే పట్నం నరేం దర్‌రెడ్డి ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లారు. మద్దూర్‌ మండలంలో 49 గ్రామ పంచాయతీలు ఉం డగా మండలంలోని కొత్తపల్లిని మండల కేంద్రంగా చేస్తూ నిడ్జింత, ఎక్కనేడ్‌, భూ నేడ్‌, దుప్పట్‌ ఘట్‌, కిసాన్‌ నగర్‌, గోకుల్‌ నగర్‌, తిమ్మారెడ్డి పల్లి, నందిగామ, లింగం చేడ్‌, పెద్దాపూర్‌, మన్నాపూర్‌, అల్లీపూర్‌, కొత్తపల్లి తండాలను కలపనున్నారు. కో స్గిలోని గుండుమాల్‌ గ్రామాన్ని మండల కేంద్రం చేస్తూ మద్దూర్‌ మండలంలోని వీరా రం, కొమ్మూర్‌ గ్రామాలతో పాటు కోస్గి మండలంలోని భోగారం, బస్తీమళ్ల, హన్మన్‌ పల్లి, ముదిరెడ్డిపల్లి, అప్పాయిపల్లి, సారంగరావుపల్లి, బలబద్రాయి పల్లి, అమ్లీకుంట గ్రామాలతో కొత్త మండలంగా ఏర్పాటు కానుంది. 

Updated Date - 2021-07-29T04:38:55+05:30 IST