దళితబంధుపై టీఆర్‌ఎస్ డ్రామా
ABN , First Publish Date - 2021-10-21T05:01:27+05:30 IST
దళితబంధుపై టీఆర్‌ఎస్ డ్రామా ఆడుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాజశేఖరశర్మ అన్నారు.

- బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రాజశేఖరశర్మ
- అలంపూర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
అలంపూర్ చౌరస్తా, అక్టోబరు 20: దళితబంధుపై టీఆర్‌ఎస్ డ్రామా ఆడుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాజశేఖరశర్మ అన్నారు. బుధవారం బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి అలంపూర్ చౌరస్తాలో రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజంగా దళితులపై సర్కారుకు ప్రేమ ఉంటే విడుదల చేసిన దళితబంధు డబ్బులను ఎందుకు ఫ్రీజ్ చేశారని ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఎన్నికల కోడ్ ఉంటుందని తెలియదా అని ప్రశ్నించారు. హైదరాబాదులో వరదబాధితుల విషయంలో బీజేపీపై ఇదే ఆరోపణలు చేసి ప్రజాగ్రహనికి గురయ్యారని, అదే హుజూరాబాద్‌లో జరగబోతుందని అన్నారు. బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేసిన స్థానిక ఎమ్మెల్యే ఇదే నియోజకవర్గానికి దళితబంధు ఇవ్వమని అసెంబ్లీలో అడిగారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని దళితులందరికీ మూడెకరాలు ఇచ్చి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. బీజేపీపై అబద్దపు ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేష్, క్యాతుర్ గురునాథ్‌రెడ్డి, కంచుపాడు వెంకటేష్, నర్సింహులు, మానవపాడు మండల అధ్యక్షుడు విజయ్, దళితమోర్చా మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయ కులు సురేష్, శేఖర్, భరత్, లాలు, మధు, చైతన్య, శివ పాల్గొన్నారు.