విజయోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2021-08-11T04:47:40+05:30 IST

టోక్యోలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు శుభాభివందనాలు తెలుపుతూ మంగళవారం మక్తల్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులు, ప్రజలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

విజయోత్సవ ర్యాలీ
మాట్లాడుతున్న టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ సభ్యులు

మక్తల్‌, ఆగస్టు 10 : టోక్యోలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు శుభాభివందనాలు తెలుపుతూ మంగళవారం మక్తల్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులు, ప్రజలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నల్లజానమ్మ దేవాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు విజయాలు సాధించిన భారత క్రీడాకారుల ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. జయహో భారత్‌ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు రఘుప్రసన్న భట్‌, అధ్యక్షుడు గోపాలం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారుల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. వంద సంవత్సరాల తర్వాత బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా దేశానికి స్ఫూర్తిదాయకమని, పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీన, రవికుమార్‌ దయ్య, భజరంగ్‌పుణ్య పురుషుల హాకీ జట్టు పతకాలు సాధించి భారత కీర్తిని పెంచారని అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి అంబ్రేష్‌, కోశాధికారి ఇరాఫ్‌, నిర్వహణ కార్యదర్శి దామోదర్‌, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణమూర్తి, డీవీ.చారి, పృథ్వీ, పీఈటీలు ఇబ్రహీం, విష్ణు, భరత్‌, కృష్ణ, వెంకటేష్‌, గిరి, నరేందర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T04:47:40+05:30 IST