సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళి

ABN , First Publish Date - 2021-11-01T04:08:26+05:30 IST

భారత దేశాన్ని ముక్కలు కాకుండా సంస్థాలను విలీనం చేసి దేశాన్ని దృఢంగా నిలబెట్టిన సర్దార్‌ పటేల్‌కు బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు.

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళి
పేటలో సర్దార్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులు

నారాయణపేట, అక్టోబరు 31 : భారత దేశాన్ని ముక్కలు కాకుండా సంస్థాలను విలీనం చేసి దేశాన్ని దృఢంగా నిలబెట్టిన సర్దార్‌ పటేల్‌కు బీజేపీ నాయకులు ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటేల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, సిద్ది వెంకట్రాములు, నందు నామాజీ, రఘువీర్‌, ప్లోర్‌ లీడర్‌ రఘుపాల్‌, కౌన్సిలర్లు రమేష్‌, రాఘవేంద్ర, ప్రమీలాబాయి, మల్లేష్‌, లక్ష్మణ్‌, రాము, రఘు పాల్గొన్నారు.


నారాయణపేట టౌన్‌, : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని కలెక్టరేట్‌లో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళిఅర్పించి రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో నర్సింగ్‌రావ్‌, బీసీ సంక్షేమ అధికారి కృష్ణమ చారీ, ఆర్డీవో ఏవో షర్పోద్దిన్‌, తహసీల్దార్‌ నాగలక్ష్మీ, బాలాజీ, రవి పాల్గొన్నారు.


నారాయణపేట క్రైం : జిల్లా పోలీసు కా ర్యాలయంలో ఆదివారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ భరత్‌ కుమార్‌  పటేల్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. దేశ ప్రజలను ఏక తాటిపైకి తీసుకవచ్చి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆర్‌ఐ కృష్ణయ్య, ఏఆర్‌ ఎస్‌ఐ గిరి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


మక్తల్‌ : ఉక్కు మనిషి, మాజీ ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యతా పరుగును పురస్కరించుకొని ఆదివారం టగ్‌ ఆఫ్‌ వార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మినీ స్టేడియం గ్రౌండ్‌లో ఐక్యతా పరుగును ప్రారంభించారు. క్రీడల్లో శిక్షణ పొందన 30మంది క్రీడాకారులు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అమర్‌ హై, భారత్‌ మాతాకీ జై, జాతీయ సమైక్యతను కాపాడు కుందాం, ఏక్‌ భారత్‌ ఏక్‌ శ్రేష్ట్‌ అనే నినాదంతో పుర వీధుల గుండా ఘనంగా ఐక్యతా పరుగు నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో  ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాలం మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో 544 సంస్థలను విలీనం చేసిన గొప్పవీరుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని, విదేశీ వస్తువులను బహిష్కరించిన గొప్ప దేశభక్తుడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం క్రీడాకారులచే జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించి సర్దార్‌ పటేల్‌కు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రఘు ప్రసన్నభట్‌, కార్యదర్శులు అంబ్రేష్‌, దామోదర్‌, రూప, కోశాధికారి కృష్ణమూర్తి, రామకృష్ణ, తిరుపతి, కృష్ణ, రౌఫ్‌, మణికంఠ పాల్గొన్నారు. 


కృష్ణ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రాములు ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్వేయర్‌ మల్లేష్‌, వీఆర్‌ఏలు అంజినయ్య, మచెందర, నాగప్ప పాల్గొన్నారు.Updated Date - 2021-11-01T04:08:26+05:30 IST