అంతటా ముక్కోటి వృక్షార్చన

ABN , First Publish Date - 2021-07-25T04:04:36+05:30 IST

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని శనివారం అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి అటవీ భూమి 33 హెక్టార్లలో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మొక్కలు నాటారు.

అంతటా ముక్కోటి వృక్షార్చన
అటవీ భూమిలో మొక్క నాటుతున్న ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

   - పాల్గొన్న ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు


 అచ్చంపేట/ఉప్పునుంతల, జూలై 24: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని శనివారం అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి అటవీ భూమి 33 హెక్టార్లలో  ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మొక్కలు నాటారు.  డివిజన్‌ కేం ద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌ ఏఎంసీ చైర్మన్‌ సీ రెడ్డి,  ఎంపీపీ శాంతాభాయి, లోక్యానాయక్‌తో కలిసి మొక్క లు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలను మనం బతికిస్తే అవి మనల్ని బతికిస్తాయన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అంతకు ముందు అటవీ పర్యాటక వాహనంలో ఎక్కి పరిశీలించారు. అలాగే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ జ న్మదినం సందర్భంగా ఉప్పునుంతలతో పాటు మండల పరిధిలోని గ్రామాలలో టీఆర్‌ఎస్‌  నాయకులు మొక్కలు నాటి శుభాంక్షాక్షలు తెలిపారు. అదే విధంగా మండల పరిధిలోని కంసానిపల్లి తండాలో అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్‌  మొక్కలు నాటారు.  తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మణ్‌రావు, ఏపీవో సుదర్శన్‌గౌడ్‌, ఎంపీవో వెంకటేష్‌, సర్పంచ్‌ మణెమ్మ, నాయకులు రవి పాల్గొన్నారు. 

వెల్దండలో..

వెల్దండ: మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో స్థానిక సర్పంచ్‌లు మొక్కలు నాటారు. వెల్దండలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మనూచౌదరితో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మొక్కలు నాటగా, తిమ్మినోనిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచ్‌లు భూపతిరెడ్డి, రాంచంద్రారెడ్డి, పత్యానాయక్‌, అంజినాయక్‌, మాజీ ఎంపీపీ జయప్రకాష్‌, నాయకులు జైపాల్‌నాయక్‌, భాస్కర్‌రావు, కోఆప్షన్‌ హలీం, యాఖూబ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-07-25T04:04:36+05:30 IST