ఐదుగురు ఎస్‌ఐల బదిలీ
ABN , First Publish Date - 2021-10-29T05:36:42+05:30 IST
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పని చేస్తున్న ఐదుగురు ఎస్‌ఐలకు బదిలీ జరిగింది.
మహబూబ్‌నగర్, అక్టోబరు 28 : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పని చేస్తున్న ఐదుగురు ఎస్‌ఐలకు బదిలీ జరిగింది. ఈ మేరకు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహ బూబ్‌నగర్ టూ టౌన్ ఎస్‌ఐగా పని చేస్తున్న సీహెచ్ వెంకటేశ్వర్లును కోయిలకొండకు, కోయిలకొండలో పనిచేస్తున్న సురేశ్ గౌడ్‌ను నారాయణపేటకు, నారాయణపేటలో పని చేస్తున్న ఎస్‌ఐ సైదులును వీఆర్ మహబూ బ్‌నగర్‌కు, మరికల్ ఎస్‌ఐ నాసర్‌ను వీఆర్ మహబూబ్‌నగర్‌కు, వీఆర్‌లో ఉన్న పి.అశోక్‌బాబును మరికల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.