గ్రామ దేవతల అనుగ్రహం ఉండాలి

ABN , First Publish Date - 2021-12-27T04:12:52+05:30 IST

గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయూరారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి కోరారు.

గ్రామ దేవతల అనుగ్రహం ఉండాలి
బొడ్రాయి పండుగలో భాగంగా పూజలు చేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 


జడ్చర్ల, డిసెంబరు 26 : గ్రామ దేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయూరారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి కోరారు. మండలం లోని అల్వాన్‌పల్లిలో మూడురోజుల నుంచి నవగ్రహాల పూజ, కోటమైసమ్మ, బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ పూజలు చేసేందుకు అల్వాన్‌పల్లికి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా తరలిరావ డంతో సందడి నెలకొంది. దీంతో అల్వాన్‌పల్లి పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్ర మంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, సర్పంచ్‌ విజయలక్ష్మి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు గోవర్ధన్‌ రెడ్డి, రఘుపతిరెడ్డి, జంగయ్య, ఇంతియాజ్‌ఖాన్‌, శంకర్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ సత్యం, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-27T04:12:52+05:30 IST