బావిలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-09T03:35:17+05:30 IST
స్నానం చే సేందుకు బావికెళ్లి ప్రమాదవశాత్తున బావి నీటిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరి ధిలోని గండ్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పెద్దకొత్తపల్లి, మే 8: స్నానం చే సేందుకు బావికెళ్లి ప్రమాదవశాత్తున బావి నీటిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరి ధిలోని గండ్రావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబం ధించి హెడ్‌కానిస్టేబుల్ కుర్మయ్య తె లిపిన వివరాల ప్రకారం... బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామానికి చెంది న బాలమణి, ముత్యాలుల కుమారుడు మానపాడు బాలరాజు(30) ఈ నెల 6వ తేదీన పె ద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లి గ్రామంలో జరిగే బంధువుల వివాహానికి వచ్చాడు. 7వ తే దీన ఉదయం 11గంటలకు గ్రామ సమీపంలోని కొమిటోల్ల బావికి స్నానం చేసేందుకు వెళ్లా డు. బావి నీటిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తున నీటిలో మునిగి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ కుర్మయ్య తెలిపారు.
స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు..
తాడూరు: స్విమ్మింగ్‌ఫుల్‌లో సరదాగా స్నేహితులతో ఈత కొడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన శనివారం తాడూరు మండలం చెర్లతిర్మ లాపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన వంశీ(22) స్నేహితులతో కలిసి ఉయ్యాలవాడ చెర్లతిర్మలా పూర్ గ్రామాల మధ్య ఉన్న స్విమ్మింగ్‌ఫుల్ వద్ద ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవ శాత్తు నీళ్లలో ఫిట్స్ రావడంతో అక్కడే మృతి చెందాడని తోటి స్నేహితులు తెలిపారు. అనం తరం స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నాగర్‌కర్నూ ల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహానికి సంబంధించి బంధువుల నుంచి ఎలాం టి ఫిర్యాదు అందలేదు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.
వేరుశనగ యంత్రం కింద పడి మహిళ..
ఊర్కొండ: వేరుశనగ యంత్రం బోల్తా పడిన సంఘటనలో మహిళా కూలి మృతి చెందడంతో పాటు, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మాదారం శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్‌కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాదారం శివారులో ట్రాక్టర్‌తో పాటు ఉన్న వేరుశనగ యంత్రంతో పనులు ముగించుకొని కల్వకుర్తి మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఇంటి బాటపట్టగా పొలంలో ఉన్న గట్టుపై ఎక్కించే సమయంలో అదుపు తప్పి యంత్రంతో పాటు ట్రాక్టర్ బోల్తా పడ్డాయి. వేరుశనగ యంత్రంపై కూర్చొని ప్రయాణిస్తున్న మహిళలు పర్వీన్‌బేగం (37) మృతి చెందగా, సుజాత, మణెమ్మలు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన పర్వీన్‌బేగం ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం కాగా, భర్త గతంలోనే ఓ ప్రమాదంలో మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులున్నారు. భర్త మృతి చెందినప్పటి నుంచి పర్వీన్‌బేగం తన తల్లిదండ్రుల గ్రామమైన కల్వకుర్తి మండలంలోని జీడిపల్లిలో కూలీ చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నది. ఆమె మృతితో ఇద్దరు కుమారులు అనాథలు కావడంతో రాంరెడ్డిపల్లి, జీడిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లి ఖైరత్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్‌కుమార్ పేర్కొన్నారు