మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-05-09T03:31:53+05:30 IST

కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
వెల్దండలో రంజాన్‌ దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌


వెల్దండ, మే 8: కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బతుకమ్మ చీరలు, క్రైస్తవులకు, ముస్లింలకు రంజాన్‌ కిట్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలలో ప్రభుత్వం ముందుందని జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. సర్పంచ్‌లు యెన్నం భూపతిరెడ్డి, శారదమ్మ, ఇంచార్జ్‌ తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీటీసీ వెంకటయ్య, కోఆప్షన్‌ హలీం, నాయకులు యాఖూబ్‌, జైపాల్‌నాయక్‌, సాదిక్‌ తదితరులు ఉన్నారు. Updated Date - 2021-05-09T03:31:53+05:30 IST